guravayanam

పుట్టినరోజు పండగే అందరికి …

పుట్టినరోజు. హ్యాపీ బర్త్ డే అంటే ఎవరికి మాత్రం ఇష్టముండదు చెప్పండి… ఈ హ్యాపీ బర్త్ డే లు చిన్నపిల్లలు మాత్రమే ఎందుకు చేసుకోవాలి. అందరూ అన్నివయసులలో చేసుకోవాలంటాను. బర్త్ డే అంటే కాస్త ఎక్కువ సంతోషం , మనకంటూ కాస్త ప్రత్యేకత ఉంటాయి.. ఒప్పుకుంటారు కదా.. స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులనుండి స్పెషల్ ట్రీట్మెంట్.. నిజంగా ఆ రోజంతా భలే ఉంటుంది కదా…

కాని మనకంటూ ఒక మంచిపేరు, గుర్తింపు, సమాజానికి చేతనైనంత సాయం చేసామన్న తృప్తితో పుట్టినరోజు జరుపుకోవడం .. అదో మాటలకందని అనుభూతి. కాదంటారా?

అందుకే..

హ్యాపీ బర్త్ డే టు మీ…