Testimonial

 Ratnagiri

Hospitals లో Hospitalityతో patientsతోపాటు వారి బంధుమిత్రులకు ఆహ్లాదకరమైన అనుభూతిని కలగజేస్తున్న Dr గురవా రెడ్డి గార్కి అభివం(నం)దనలు.
అసలు సిసలైన గ్రామీణ పడికట్టు పదప్రయోగంతో మీ అనుభవాలు, అనుభూతులు గురవాయణం ద్వారా పంచుకున్న వైనం వైవిధ్యభరితం.
మీ విశిష్టమైన ఆత్మీయ ఆతిథ్య వ్యవహారశైలి హాస్పిటల్లోని అన్ని స్థాయిల్లో ప్రతిబింబించేలా చేసి human touchతో వైద్యంలో వేరెవరికీ సాధ్యం కాని కోణాన్ని ఆవిష్కరించారు. దీని వెనుక ఉన్న శిక్షణ, సాధన మరియు సమయ, వనరుల కేటాయింపు ఎంత కష్టసాధ్యమో మానవ వనరుల నిర్వహణలో డాక్టరేట్ గా నాకు విదితమే.
గురవాయణంలో మీరు ” డాక్టర్ని అని కూడా మర్చిపోయి ఏడ్చాను.ఇన్నేళ్ల అనుభవం తర్వాత కూడా పేషెంట్ చనిపోతే కళ్ళు చెమ్మగిల్లుతాయి “.అని సాధారణ సంభాషణలతోనే మా హృదయాలు బరువెక్కించిన మీరు “మనీ”షి కాదు “మనిషి “.
ఎంతటి ప్రతిభావంతులైన డాక్టర్లు అయినా రోగులకు కొద్దికాలం మాత్రమే గుర్తుంటారు.కొద్దిమంది మాత్రం ప్రతిభతోపాటు అరుదైన వ్యక్తిత్వంతో చిరస్తాయిగా నిలుస్తారు.
ఆ కోవలో ప్రథమ స్థానంలో ఉండే మీతో మా అమ్మగారి(Mrs Seethamma, underwent a successful TKR with corrective Osteotomy)శస్త్రచికిత్స సందర్భంగా పరిచయభాగ్యం మహదానందంగా భావిస్తూ, ఆరోగ్య సేవలో మీరు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి,వ్యక్తిగత,వృత్తిగత జీవితం ఆనందమయం కావాలని ఆకాంక్షిస్తూ…
కృతజ్ఞతతో