guravayanam

జ్యోతిగారికి ధాంక్స్….

 వారంలోని అన్ని రోజులకంటే శనివారాలు నాకు చాలా ఇష్టం. సోమవారం నుండి శుక్రవారం వరకు పేషంట్లతో, ఆపరేషన్లతో   బిజీ బిజీగా ఉంటాను.  శనివారం మాత్రం నాకోసమే అట్టి పెట్టుకున్నా. ఆ రోజు నా బాస్ (భార్యామణి) కూడా పని చేస్తుంది. ఆదివారం మొత్తం ఆమె కోసమే ధారాదత్తం  చేశా. నా లైఫ్ ని చాలా క్లారిటీ తో ప్లాన్ చేసేసాను. అఫ్కోర్స్ ఆదివారాలు కూడా మా ఆవిడని మాయ చేసి నాకు నచ్చిన పనులే చేస్తుంటా అనుకోండి… అది వేరే సంగతి..

ఈ శనివారం అంటే నిన్న ఓ స్పెషల్ అతిథి మా ఇంటికి వచ్చారు. జ్యోతిగారు, వాళ్ళబ్బాయి చైతన్య. ఎందుకంటారా? వైద్యానికి కాదండి బాబు. పాఠాలు చెప్పడానికి. ఎంతో  శ్రమ తీసుకుని మా ఇంటికి వచ్చి మరీ బ్లాగ్వద్గీత బోధించారు. నా మట్టిబుర్ర కొంత వికసించింది. వాళ్ళబ్బాయి కూడా కొన్ని టెక్నికల్ విషయాలు నేర్పించాడు.

ఏదో ఒక రోజు నేను కూడా జ్యోతిగారిలా, చందు శైలజలా, రమణలా  (అదేనండి మీకు తెలిసిన పనిలేక బ్లాగర్)  గొప్ప బ్లాగ్ బస్టర్  అయిపోవాలని నాకు నేనే ఆశీర్వదించుకుంటూ ……………. స్వస్తి …

మీ గురవారెడ్డి.