భళా బాహుబలి భళా…

Posted By: Dr Gurava Reddy
నాకు చిన్న‌ప్పటి నుంచి బంధువులు ఇంటికి వ‌స్తున్నారంటే సూప‌ర్ హ్యాపీస్ అన్న మాట‌. ఎందుకంటే బంధువుల‌న్నాక స్వీట్లు, హాట్లు పొట్లాలు క‌ట్టించుకొని తెచ్చేవారు. వాటిని హ్యాపీగాలాగించేయ‌చ్చు. స‌రి కదా, వాళ్లు ఉన్నంతసేపు ఎంత అల్ల‌రి చేసిన అమ్మా నాన్నఏమీ అనేవారు కాదు, ఆ త‌ర్వాత వీపు విమానం మోత …

కూరకి తాలింపు – మాటకి లాలింపు

Posted By: Dr. Gurava Reddy
  మా అమ్మ ఎప్పుడూ ఒక సూక్తి చెప్తుండేది… ‘కూరకి తాలింపు – చీరకి జాడింపు – మాటకి లాలింపు‘ అవసరమని. కూర సంగతి, చీర సంగతి మనకు పెద్ద తెలియదు కానీ. – మాటకి మట్టుకు లాలింపు ఉండాల్సిందేనని నా గట్టి నమ్మకం. అలా అని నేను …

పేరులో ఏముంది?!

Posted By: Dr. Gurava Reddy
  పేరులో ఏముంది? “వాటీజ్ ఇన్ ఎ నేమ్? దట్ విచ్ వియ్ విల్ కాల్ ఎ రోజ్ బై ఎనీ అదర్ నేమ్ – వుడ్ స్మైల్ యాజ్ స్వీట్” అని షేక్‌స్పియర్ మహానుభావుడు ఎప్పుడో, ఎక్కడో అన్నాడట. అప్పటినుంచి మనోళ్లందరూ తెగ రెచ్చిపోతుంటారు.. పేరులో ఏముంది, …

ఇల్లు ఇల్లులాగా లేదు!

Posted By: Dr. Gurava Reddy
  ఆదివారం సాయంత్రం. ఒక్కడినే ఇంట్లో. గజల్ శ్రీనివాస్ మధుర స్వరం. సీడీ ప్లేయర్ నుంచి అలలు అలలుగా గుండెను తాకుతోంది. ఎందుకో మధ్యాహ్నం భోజనాల వేళ నుంచి వెలితిగా, గుబులుతా ఉంది. నేను, నాన్న మాత్రమే ఉన్నాం. మా అమ్మాయి కావ్య డ్యూటీలో ఉంది. అబ్బాయ్ ఆదర్శ్‌ని …

చూసే కళ్లకు మనసుంటే

Posted By: Dr. Gurava Reddy
  రాత్రి పదయింది. ఆరుబయట గార్డెన్‌లో నా పడకకుర్చీలో ఒదిగిపోయాను. పైన పిండి వెన్నెల – చల్లటి గాలి.. చుట్టూ నిశ్శబ్దం. ప్రపంచమంతా  నిద్దరపోతోంది. మై ఔర్ మేరీ తన్‌హాయీ.. ‘చాయాగీత్‘ మొదలైంది వివిధభారతిలో. ‘ఏక్ తేరా సుందర్ ముఖ్‌డా – ఏక్ తేరా ప్యార్‌సే బరా దిల్ …

ఆయన దొరికితే అంతే..

Posted By: Dr. Gurava Reddy
  కలాంగారు నాకు బాగా తెలుసు. ఆయనే కాదు – వాజ్‌పాయ్ కూడా బాగా తెలుసు. ఆ మాటకొస్తే మోడీ, సోనియా కూడా బాగా తెలుసు. కాకపోతే వాళ్లెవరికీ నేను తెలీదు. అంతే. నేమ్  డ్రాపింగ్ అన్నది ఓ కళ. మనకి చాలామంది తారసపడ్తుంటారు. సంభాషణలో సూటిగా చెప్పకుండా, …

అమ్మ చేతిలో చెయ్యేసి

Posted By: Dr Gurava Reddy
    అమ్మకి ఆరోగ్యం బాగోక ఆరునెలలు అయింది. కొద్దిపాటి విరేచనలతో మొదలైన అనారోగ్యం, అన్నిరకాల కాంప్లికేషన్స్ నీ పోగేసుకుని, చివరకు స్ట్రోక్‌గా(పక్షవాతం) అవతరించి, అమ్మని వీల్ చెయిర్‌కి పరిమితం చేసేసింది. అంతకుముందు నాకూ, ఆమెకీ ఎప్పుడూ ఒకటే యుద్ధం. నా దగ్గరే ఉండిపొమ్మని నేనూ – “నాకిక్కడ …

బాహుబలి – భళిరా భళి

Posted By: Dr. Gurava Reddy
  చిన్నప్పుడు ఎన్.టి.ఆర్. కాంతారావు కత్తి(లాంటి) సిన్మాలు నేల క్లాస్‌లో కూచుని, కళ్లు, నోరు తెరుచుకుని మరీ తెగ చూసేవాణ్ని.  ఓ సిన్మాలో యుద్ధం సీనులో ఓ సైనికుడి చేతికి రిస్ట్‌వాచ్ కనపడితే, మా బాబాయిని అడిగాను. ‘నువ్విచ్చే అర్ధరూపాయికి వాచ్ కాక బంగారు కంకణం కనపడుద్దేటిరా.. మూసుకుని …

రామాయణ వాస్తవ రూపం (గురవారెడ్డితో కబుర్లు)

Posted By: Dr. Gurava Reddy
హలో!!! హలో!!!  నేను గుర్తున్నానా!! మర్చిపోయే కాండిడేట్ నా??  మళ్లీ నా కబుర్లతో మీ బుర్ర తినడానికి వచ్చేేసా.. ఈసారి  చిత్రసీమ మనకు పరిచయం చేసిన రామాయణానికి భిన్నంగా వాస్తవ రూపాన్ని Facebook , what’s up జనరేషన్ కి కూడా అర్ధమయ్యే రీతిలో సరదా సంభాషణలో వినండి. …

డా.మృణాళినితో ఇంటర్వ్యూ

Posted By: Dr Gurava Reddy
కథానికల రచయితగా, అనువాదకురాలిగా రేడియో, టెలివిజన్ హోస్ట్ గా చాలామందికి సుపరిచితురాలయిన మృణాళినితో నిన్న అంటే ఈ నెలలో మొదటి బుధవారం నేను చేసిన ఇంటర్వ్యూ  కింద లింకులో వినండి.. రియల్లీ చాలా టాలెంటెడ్ లేడీ.. గురవారెడ్డితో కబుర్లు